News January 27, 2025
పార్వతీపురం: రామవరం సర్పంచ్‌కు జాతీయ పురస్కారం

సీతానగరం మండలం రామవరం గ్రామపంచాయతీ సర్పంచ్ పీ సత్యం నాయుడుకు జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచిగా పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేతుల మీదుగా ఆయన ఆదివారం అవార్డు అందుకున్నారు. గ్రామపంచాయతీని అభివృద్ధి చేయడంలో ప్రతిభ కనబరచడం వల్ల కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందించారు.
Similar News
News February 23, 2026
అనంతపురం: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన బి.ఫార్మసీ 3-1, 3-2 (R15, R19, R23) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవడానికి https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News February 23, 2026
NRPT: కలెక్టరేట్ ప్రజావాణికి 29 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలనీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. నారాయణపేట కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 29 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్‌కి తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అదనపు కలెక్టర్ శ్రీను, అధికారులు పాల్గొన్నారు.
News February 23, 2026
భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న 60 వేల మంది

వేములవాడ భీమేశ్వర స్వామి వారిని సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 59,796 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, కుంకుమ పూజలు తదితర మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. 4,855 మంది భక్తులు కోడె మొక్కు చెల్లించుకున్నట్లు వారు వివరించారు.


