News January 27, 2025

పార్వతీపురం: రామవరం సర్పంచ్‌కు జాతీయ పురస్కారం

image

సీతానగరం మండలం రామవరం గ్రామపంచాయతీ సర్పంచ్ పీ సత్యం నాయుడుకు జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచిగా పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేతుల మీదుగా ఆయన ఆదివారం అవార్డు అందుకున్నారు. గ్రామపంచాయతీని అభివృద్ధి చేయడంలో ప్రతిభ కనబరచడం వల్ల కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందించారు.

Similar News

News February 11, 2025

ఏ బీరుపై ఎంత రేటు పెరిగిందంటే?

image

TG: రాష్ట్రంలో బీర్ల ధరలు ఇవాళ్టి నుంచి 15% పెరిగాయి. KF స్ట్రాంగ్ రేటు రూ.160 నుంచి రూ.184కు, లైట్ రూ.150 నుంచి రూ.172కు, అల్ట్రా మాక్స్ రూ.220 నుంచి రూ.253కు చేరాయి. అలాగే బడ్వైజర్ లైట్ రూ.210 నుంచి రూ.241కు, మ్యాగ్నం రూ.220 నుంచి రూ.253కు, టుబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగాయి. ఈ పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.

News February 11, 2025

షీలానగర్-పోర్టు రోడ్డులో యాక్సిడెంట్ 

image

షీలానగర్-పోర్టు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాకకు చెందిన ఎం.నరసింహారావు సైకిల్‌పై టీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం టీ పట్టుకొని వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు.

News February 11, 2025

పాడేరు: యథావిధిగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు  

image

బుధవారం జరగాల్సిన(రేపు) ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను యథావిధిగా కొనసాగిస్తామని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ మంగళవారం తెలియజేశారు. అయితే ఈనెల 11వ తేదీన రద్దు చేసిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని చెప్పారు. >Share it

error: Content is protected !!