News February 1, 2025
పార్వతీపురం : రిజిస్ట్రేషన్లపై పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి

రిజిస్ట్రేషన్లపై పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని జిల్లా రిజిస్ట్రార్ రామలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. రూరల్, అర్బన్, వాణిజ్య ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా ధరలు ఉంటాయని చెప్పారు. పార్వతీపురం నియోజకవర్గంలో 2-10 శాతం, పాలకొండ నియోజకవర్గం లో 30-40, కురుపాం నియోజకవర్గంలో 13 -40 శాతం, సాలూరు నియోజకవర్గం లో 16- 20 శాతం ఛార్జీలు పెరిగాయన్నారు. నేటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
Similar News
News February 23, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తికి ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు. సత్యసాయి జిల్లాలో 42 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
News February 23, 2026
కృష్ణా: ‘డిగ్రీలతో ఉద్యోగాలు రావు’

అత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావన్నారు. నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకొని వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
News February 23, 2026
మేం హిందుత్వ రాజకీయాలు చేయం: భాగవత్

RSS హిందుత్వ రాజకీయాలు చేయదని, కేవలం వ్యక్తి నిర్మాణంతో సమాజం, దేశాభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. శక్తిమంతమైన వ్యక్తులే బలమైన సమాజాన్ని నిర్మించగలరని, అందుకే వ్యక్తి వికాసమే తమ లక్ష్యమని డెహ్రాడూన్లో జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడారు. సంఘ్ వాస్తవ రూపాన్ని బయటి నుంచి చూసి అర్థం చేసుకోలేమని, ఆ లోతును గ్రహించాలంటే లోపల ఉండి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.


