News February 1, 2025
పార్వతీపురం : రిజిస్ట్రేషన్లపై పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి

రిజిస్ట్రేషన్లపై పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని జిల్లా రిజిస్ట్రార్ రామలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. రూరల్, అర్బన్, వాణిజ్య ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా ధరలు ఉంటాయని చెప్పారు. పార్వతీపురం నియోజకవర్గంలో 2-10 శాతం, పాలకొండ నియోజకవర్గం లో 30-40, కురుపాం నియోజకవర్గంలో 13 -40 శాతం, సాలూరు నియోజకవర్గం లో 16- 20 శాతం ఛార్జీలు పెరిగాయన్నారు. నేటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
Similar News
News February 11, 2025
HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
News February 11, 2025
డయాబెటిస్ ఉన్నా ఈ పండ్లు తినొచ్చు

తీపి పండ్లు తినాలని అనిపిస్తున్నా డయాబెటిస్ ఎక్కువవుతుందని మధుమేహులు భయపడుతుంటారు. రాస్ప్‌బెరీ, అవకాడో, ఆప్రికాట్, బ్లాక్‌బెరీ, పుచ్చకాయల్ని వారు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని, మేలు చేకూర్చే కొవ్వులు ఎక్కువ ఉంటాయని వివరిస్తున్నారు. అయితే మధుమేహులు తమ షుగర్ స్థాయుల్ని బట్టి వైద్యుల సూచన మేరకు డైట్ అనుసరించాలని సూచిస్తున్నారు.
News February 11, 2025
పెద్దపల్లి: అతి తక్కువ ధరకు మట్టి, మొరం: కలెక్టర్

జిల్లాలో ప్రజలకు సొంత అవసరాల కోసం అవసరమైన మట్టి, మొరం తీసుకునేందుకు తహశీల్దారుల ద్వారా అతి తక్కువ ధరకు అనుమతి మంజూరు అవుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మట్టి, మోరం సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక ట్రాక్టర్‌కు రూ.200, టిప్పర్‌కు రూ.800 రుసుము తహశీల్దార్లకు చెల్లించి అనుమతి పొందాలన్నారు.