News February 13, 2026

పార్వతీపురం: ‘రేపు పాఠశాలలకు సెలవు రద్దు’

image

పార్వతీపురం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO బ్రహ్మాజీ రావు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని చెప్పారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.

Similar News

News March 13, 2026

గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి

image

గ్యాస్ కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. అపోహలను సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో సమీక్ష నిర్వహించారు. ములుగు కలెక్టర్ దివాకర టి.ఎస్ పాల్గొన్నారు.

News March 13, 2026

గద్వాల: 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం అలంపూర్‌లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు ఎండలు ఇలాగే కొనసాగుతాయని, అయితే మార్చి 16 నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

News March 13, 2026

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ

image

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.6వేలు చొప్పున జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ మూడో విడత కింద రూ.4వేలు.. మొత్తంగా రూ.6వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పెట్టుబడి సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.