News March 12, 2025
పార్వతీపురం: వన్యప్రాణులకు తాగునీటి ఏర్పాట్లు

వేసవికాలంలో వన్యప్రాణులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అటవీ ప్రాంతంలో తాగునీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్వతీపురం అటవీ శాఖ రేంజర్ బిర్లంగి రామ్ నరేశ్ తెలిపారు. మంగళవారం కొమరాడ మండలంలో సరుగుడు గూడ అటవీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో కొమరాడ అటవీ శాఖ సెక్షన్ అధికారి బీట్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
అనంతగిరి: ముగ్గురిని బలిగొన్న పడవ

అనంతగిరి మండలం జీనబాడు రేవు వద్ద రైవాడ జలాశయంలో ఆదివారం జరిగిన పడవ బోల్తా ఘటనలో గల్లంతైన మరో యువకుడు దబారి రమేశ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మూడు రోజులుగా గాలింపులు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశాయి. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు జలాశయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.
News November 26, 2025
వీటిని వంటగదిలో పెడుతున్నారా?

కిచెన్లో గ్యాస్ లీక్, కుక్కర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్ ఇలా ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. కిచెన్లోనే ఫ్రిడ్జ్, ఓవెన్ ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువ. ఇలా కాకుండా ఉండాలంటే వీటిని వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే ప్రాంతంలో పెట్టాలి. అలాగే ఒవెన్, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ దూరంగా ఉంచాలి. ఓవర్ లోడింగ్, విద్యుత్ హెచ్చుతగ్గులు, పాతవస్తువులు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 26, 2025
తిరుమల PAC 1, 2 & 3 భవనాలకు రూ.9 కోట్లు విరాళం

తిరుమల PAC 1, 2 & 3 భవనాల అధునీకరణకు దాత మంతెన రామలింగ రాజు రూ.9 కోట్లు విరాళం అందించారు. కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేర్లపై ఈ విరాళం సమర్పించారు. 2012లో కూడా రూ.16 కోట్లు విరాళమిచ్చిన రామలింగ రాజును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు అభినందించారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ధ్యేయంతో విరాళం అందించిన దాతను టీటీడీ అధికారులు ప్రశంసించారు.


