News January 10, 2026

పార్వతీపురం: వార్నీ 8 గంటలు లేటు.. ఖాళీగా వెళ్తున్న ట్రైన్

image

ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ నిర్ణీత సమయంలో బయలుదేరకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. మన్యం జిల్లా పార్వతీపురం- హైదరాబాద్ 07465 స్పెషల్ రైలు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలు ఆలస్యంగా దువ్వాడకు చేరుకుంది. దీంతో రైల్లో ప్రయాణికులు కనిపించలేదు.. సరి కదా వెలవెలబోతూ తన గమ్యస్థానానికి వెళుతోంది.

Similar News

News January 15, 2026

కనుమ నాడు గోవులకు పూజ ఎందుకు చేస్తారు?

image

కనుమ అంటేనే పశువుల పండుగ. అవి ఏడాదంతా పొలం పనుల్లో రైతుకు చేదోడువాదోడుగా ఉంటాయి. పంట చేతికి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు కృతజ్ఞతగా నేడు వాటిని పూజిస్తాం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలురను రక్షించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గోపూజ సంప్రదాయం మొదలైంది. ఆవును జంతువుగా మాత్రమే కాకుండా ప్రకృతికి, జీవనాధారానికి ప్రతీకగా భావిస్తారు. ఆవును గౌరవించడం మన సంస్కృతిలో భాగం.

News January 15, 2026

అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.

News January 15, 2026

53 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడి వైపు ప్రయాణం

image

53 ఏళ్ల తర్వాత మళ్లీ జాబిల్లి చెంతకు వ్యోమగాములు చేరనున్నారు. నాసా ‘ఆర్టెమిస్‌-2’ మిషన్‌లో నలుగురు వ్యోమగాములు రీడ్ వైజ్‌మేన్‌, విక్టర్ గ్లోవర్‌, క్రిస్టినా కోచ్‌, జెరెమీ హాన్సెన్‌ వచ్చే నెల 6న ప్రారంభమై 10 రోజులపాటు చంద్రుని చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి వస్తారు. 1972లో చేపట్టిన అపోలో తర్వాత తొలి మానవ సహిత మిషన్‌ ఇది. ఆర్టెమిస్‌-3 ద్వారా మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లనున్నారు.