News March 26, 2025
పార్వతీపురం: విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయికి దేహశుద్ధి

పార్వతీపురం మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయికి తల్లిదండ్రులు, యువకులు కలిసి దేహశుద్ధి చేశారు. బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరగగా విషయం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రవికుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Similar News
News December 3, 2025
కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

కోకాపేట్ నియోపోలిస్ భూముల వేలం ముగిసింది. నగరానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎకరాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎకరానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ కనిపిస్తుండటంతో ఇక్కడి కమ్యూనిటీని డెవలప్ చేసే అవకాశం ఉంటుందని, అందుకే ఈ నాలుగు ఎకరాలను ఆన్లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.