News March 11, 2025

పార్వతీపురం: వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల పేదలకు స్వయం ఉపాధి పథకాలు

image

జిల్లాలోని దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకం కింద యూనిట్ల స్థాపన, జెనరిక్ ఫార్మసీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సం.రంలో 21 నుంచి 60 ఏళ్ల వయసు ఉండి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.

Similar News

News January 15, 2026

ఆసిఫాబాద్: ఈ సర్పంచ్ GREAT..!

image

గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సర్పంచ్ విద్యుత్ స్తంభమెక్కి నిబద్ధతను చాటుకున్నారు. పెంచికల్పేట్ మండలం పోతేపల్లిలో సంక్రాంతి పండుగ వేళ వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని సర్పంచ్ దుర్గం పోచన్న హామీ ఇచ్చారు. అయితే బుధవారం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమయం వృథా చేయకుండా ఆయనే స్వయంగా స్తంభమెక్కి దీపాలు అమర్చారు. నాయకుడికి ఉండాల్సింది హోదా కాదు, సేవా దృక్పథమని నిరూపించిన పోచన్నను గ్రామస్థులు కొనియాడారు.

News January 15, 2026

పాలమూరులో సంక్రాంతి సంబరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. భోగిని రొట్టెల పండుగగా, సంక్రాంతిని పులగం, కనుమను తునకల పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నారు. అరిసెలు, ప్రత్యేక వంటకాలతో పల్లెలు సందడిగా మారాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జిల్లావ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తోంది.

News January 15, 2026

VZM: ఇక రైళ్లలో టీ, కాఫీ విక్రయాలు కొత్తగా ఇలా..

image

వాల్తేరు రైల్వే డివిజన్ ప్రయాణికులకు శుభవార్త. టీ, కాఫీ విక్రయాల కోసం సరికొత్త ‘హైటెక్ వేరబుల్ గ్యాడ్జెట్’ను డీఆర్ఎం లలిత్ బోహ్రా బుధవారం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రారంభించారు. ఈ ఇన్సులేటెడ్ పరికరం ద్వారా పానీయాలు ఎక్కువసేపు వేడిగా, పూర్తి పరిశుభ్రంగా లభిస్తాయి. వెండర్స్ మెడలో ధరించే ఈ గ్యాడ్జెట్‌లో డిజిటల్ పేమెంట్, వేస్ట్ కలెక్షన్ సౌకర్యం ఉండటం విశేషం. ఇది ప్రయాణికులకు సురక్షితమైన సేవలను అందిస్తుంది.