News April 5, 2025
పార్వతీపురం: ‘శని, ఆదివారాల్లో సెలవు తీసుకోరాదు’

పార్వతీపురంలోని 15 సచివాలయాల్లో రికార్డ్ పెండింగ్ పనులను పూర్తి చేసే దిశగా ఉద్యోగులు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. రికార్డు పెండింగ్ ఉన్న శని, ఆదివారాల్లో ఆ సచివాలయాల్లో ఉద్యోగులంతా తప్పకుండా విధులకు హాజరై రికార్డులు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు శని, ఆదివారాల్లో ఈ సర్వే పెండింగ్ ఉన్న ఏ సచివాలయాలను అయినా ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు ‘నేర‘జాణలు వీళ్లు.!

నెల్లూరులో ‘నేర‘జాణల హవా ఎక్కువైంది. మొన్నటి వరకు నిడిగుంట అరుణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా పెంచలయ్య హత్యతో అరవ కామాక్షి వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులతో గ్యాంగ్ నడిపిస్తూ గంజాయి వ్యాపారం చేస్తోంది. తనకు అడ్డు వచ్చి వారిని ఇదే గ్యాంగ్తో బెదిరిస్తోంది. ఈక్రమంలోనే పెంచలయ్యను కామాక్షి హత్య చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేడీ డాన్లను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.
News December 2, 2025
‘PM ఆవాస్ యోజన-NTR’ పథకానికి దరఖాస్తు గడువు పెంపు

AP: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.
News December 2, 2025
ఖమ్మం: అన్నా.. తమ్మీ.. ‘జర’ విత్డ్రా చేసుకోరాదూ!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కోసం పైరవీలు ఊపందుకున్నాయి. తొలి విడత ఉపసంహరణకు గడువు రేపటితో ముగుస్తుండటంతో, ప్రధాన పార్టీలు పోటీని తగ్గించుకునే పనిలో పడ్డాయి. “అన్నా.. తమ్మీ.. ఇద్దరం పోటీలో ఉంటే నష్టపోతాం, జర విత్డ్రా చేసుకోరాదు” అంటూ పోటీదారుల మధ్య బుజ్జగింపులు, మాటలు గ్రామాల్లో సాధారణమైంది. దీంతో అనేక చోట్ల విత్డ్రాలు జరుగుతున్నాయి.


