News August 28, 2024
పార్వతీపురం: సబ్సిడీపై తుంపర సేద్య పరికరాల సరఫరా

తక్కువ నీటి వనరులతో వ్యవసాయం చేయుటకు తుంపర సేద్య పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ITDA పరిధిలో గల గిరిజన సబ్ ప్లాన్ మండలాలలో తుంపర సేద్య రైతులకు 2024-25 సంవత్సరానికి గాను రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ITDA పరిధిలో 750 మందికి గాను రూ.53.79 లక్షలు నిధులు విడుదల చేశామన్నారు.
Similar News
News September 18, 2025
పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2025
ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.
News September 17, 2025
VZM: సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గంట్యాడ (M) కొండతామరపల్లిలోని చల్ల అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు ఉదయం 9.15 గంటలకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకటరావు, ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్, ప్రెసిడెంట్ భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.