News April 16, 2025
పార్వతీపురం: సమ్మర్ హాలీడేస్లో వీటిపై ఓ లుక్కేయండి

వేసవి సెలవులకు పార్వతీపురం మన్యం జిల్లా స్వాగతం పలుకుతుంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా వచ్చిన వారికి పర్యాటక ప్రాంతాలు వేదిక కానున్నాయి. సీతంపేట అడ్వెంచర్ పార్క్, తోటపల్లి ఐటీడీఏ పార్కు, సీతంపేట కడలి వ్యూ పాయింట్, తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, విశ్వేశ్వర దేవాలయం వంటి మరెన్నో పర్యాటక ప్రాంతాలను సందర్శించి మన్యం అందాల మధ్య ఆహ్లాదం పొందవచ్చు.
Similar News
News October 30, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

TG: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు నవంబర్ 13 వరకు స్కూళ్ల HMలకు డబ్బు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో డిసెంబర్ 11, రూ.500 ఎక్స్ట్రా ఫీజుతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత మార్చి మూడో వారంలో పది పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
News October 30, 2025
HYD: 1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా?

1987 నాటి ఈ అందమైన ఫొటో నాటి రైల్వే వ్యవస్థను గుర్తుచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్కి అకోలా జంక్షన్ నుంచి వచ్చిన ప్రయాణికులను YP 2865 లోకోమోటివ్ రైలు పొగలు కక్కుతూ, కూ.. అంటూ కూతవేస్తూ లాగేది. 1960ల చివర్లో టాటా కంపెనీ టెల్కో, జంషెడ్పూర్లో ఈ YP ఇంజిన్ తయారు చేసిందని IRAS అనంత్ తెలిపారు. తను ఉద్యోగంలో చేరిన సమయంలో రైల్వే అనుభూతులను గుర్తు చేసుకున్నారు.
News October 30, 2025
GNT: తొలగిన తుపాన్ ముప్పు.. సాధారణ స్థితికి జనజీవనం

తుపాను భయంతో కొద్ది రోజులుగా బిక్కు బిక్కు మంటూ ఇంటిపట్టునే కాలం గడిపిన జనం నెమ్మదిగా తేరుకుంటున్నారు. తుపాను తీరం దాటి ముప్పు తొలగిపోవడంతో రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. వర్షం ముసురు తొలగి సూర్య భగవానుడి రాకతో ఊపిరి పీల్చుకొంటున్నారు. సెలవుల అనంతరం విద్యా సంస్థలు కూడా తెరవడంతో పిల్లలు బడిబాట పట్టారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత వీధులన్నీ రద్దీగా మారి జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది.


