News February 3, 2025
పార్వతీపురం: ‘సైబర్ నేరాలపై దర్యాప్తు చేపట్టాలి’

సైబర్ నేరాలపై ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఐటీ కోర్ టీం అధికారులతో సమావేశం నిర్వహించారు. సైబర్ టెక్నాలజీ మీద పోలీసు సిబ్బంది పరిణితి చెందేలా శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News February 7, 2025
ఇకపై ఫోన్‌లోనే అన్ని ధ్రువపత్రాలు: భాస్కర్

AP: రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్‌పై IT శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ఇకపై అన్ని ధ్రువపత్రాలు ఫోన్‌లోనే జారీ చేస్తాం. ప్రతి పౌరుడికి DG లాకర్ సదుపాయం కల్పిస్తాం. అన్ని పత్రాలూ వాట్సాప్‌లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే అర్జీలు, ఫిర్యాదులు చేయొచ్చు. చదువురాని వాళ్లు వాయిస్ ద్వారా సంప్రదించవచ్చు. ప్రతిశాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తాం’ అని అన్నారు.
News February 7, 2025
ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే: కిషన్ రెడ్డి

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘కుల గణనతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉంది. ముస్లింలను కూడా కలిపి బీసీలకు అన్యాయం చేశారు. కుల గణన జరిపిన విధానమే సరిగ్గా లేదు. ఈ సర్వేపై బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట ప్రజల్ని విడగొట్టడం కాంగ్రెస్, రాహుల్‌కు అలవాటే’ అని విమర్శించారు.
News February 7, 2025
హీరో నాగార్జునను కలిసిన అనంతపురం ఎంపీ

ఢిల్లీలోని పార్లమెంటులో సినీ నటుడు అక్కినేని నాగార్జునను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిశారు. ప్రధాని మోదీని కలిసేందుకు పార్లమెంటుకు వచ్చిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జున ప్రధానిని కలిశారు. అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.