News January 30, 2025
పార్వతీపురం: ‘సైబర్ నేరాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలి’

సైబర్ నేరాలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్. వి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా నేర సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సైబర్ నేరాలు తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలని విధిగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలు జరిగినట్లయితే తక్షణమే వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News February 13, 2025
వరంగల్: తగ్గిన మక్కల ధర.. పల్లికాయ ధరలు ఇలా!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కల ధర మళ్లీ తగ్గింది. మంగళవారం రూ.2,370 పలికిన మక్కలు(బిల్టీ) ధర బుధవారం మరింత తగ్గి రూ.2,355కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,350కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే.. క్వింటా సూక పల్లికాయ ధర రూ.6,410 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.4,900 పలికిందని పేర్కొన్నారు.
News February 13, 2025
వైట్‌హౌస్‌లో పిల్లలతో అధ్యక్షులు

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్‌హౌస్’కు ఎలాన్ మస్క్ తన చిన్న కుమారుడిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో కొన్నేళ్లుగా అధ్యక్షులు, అధికారుల పిల్లలు సందడి చేయడం కామన్ అయిపోయింది. 2009లో ఒబామా ఇద్దరు కూతుళ్లతో, 1994లో బిల్ క్లింటన్ కూతురు చెల్సీ, 1978లో జిమ్మీ కార్టర్ తన కూతురు అమీతో, 1963లో కెనడీ తన కొడుకుతో కలిసి వైట్‌హౌస్‌లో సందడిగా గడిపారు.
News February 13, 2025
గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం

RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్‌చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.