News December 21, 2024
పార్వతీపురం: స్పందించి.. ప్రాణాన్ని కాపాడారు..!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పార్వతీపురం GRP, RPF పోలీసులు శనివారం కాపాడారు. GRP హెచ్సీ రత్నాకర్ వివరాల ప్రకారం.. పార్వతీపురం బైపాస్ కాలనీకి చెందిన B.తిరుపతిరావు ఆత్మహత్య చేసుకోడానికి బెలగాం స్టేషన్ సమీపంలో పట్టాలపై పడుకున్నాడు. అతనిని గమనించిన గూడ్స్ గార్డు సమాచారమివ్వగా.. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Similar News
News January 16, 2025
సీతానగరం: సువర్ణముఖి నదిలో పడి యువకుడి మృతి
సువర్ణముఖి నదిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వివరాల మేరకు పెదబోగిలి గ్రామానికి చెందిన ఎస్.అనుదీప్ (27) బంధువులతో కలిసి స్నానానికి వచ్చాడు. ఇసుక కోసం తవ్విన గోతిలో అనుదీప్ మునిగిపోవడంతో బంధువులు గుర్తించి బయటకు తీసి పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
News January 16, 2025
వేపాడ: ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి.. వ్యక్తి మృతి
వేపాడ మండలం కృష్ణరాయుడుపేటలో బుధవారం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల పరుగు ప్రదర్శనలో ఒక బండి అదుపు తప్పి కల్లాల వైపు వెళ్లింది. బి.దేముడు(48)పైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ దేవికి చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News January 16, 2025
ఇంటికి వచ్చిన అల్లుడికి 200 రకాల వంటకాలతో భోజనం!
పెళ్లి తర్వాత సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వచ్చిన అల్లుడికి 200 వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన తోట వెంకటేశ్వరరావు, ఉమా దంపతులు ఉద్యోగరీత్యా విజయనగరంలోని చినతాడివాడలో నివాసం ఉంటున్నారు. గోదావరి సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో తమ అల్లుడు, కూతురైన సంతోశ్ పృథ్వి, ధరణిలను తమ ఇంటికి పిలిచి 200 రకాలకు పైగా చేసిన వివిధరకాల పదార్థాలను కొసరి కొసరి వడ్డించారు.