News March 11, 2025
పార్వతీపురం స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంగళవారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆంధ్రప్రదేశ్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్‌ను నియమించింది. దీంతో బాటు రాష్ట్రంలో ఉన్న 5జోన్లకు జోనల్ అధికారులను కూడా నియమించింది.
Similar News
News February 8, 2026
‘దోస్తో’ యాప్ ద్వారానే యూరియా విక్రయాలు: డీఏఓ

జిల్లాలో యూరియా అమ్మకాలు ఇకపై యాప్ ద్వారానే సాగాలని డీఏఓ అజయ్ కుమార్ తెలిపారు. అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ‘దోస్తో’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా దుకాణదారులు నిరంతరం స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు తోడ్పాటు అందించాలని ఒక ప్రకటనలో కోరారు.
News February 8, 2026
కాకినాడ కొత్త DROగా తిప్పేనాయక్

కాకినాడ DROగా డాక్టర్ తిప్పేనాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన వెంకటరావు సింహాచలం దేవస్థానం ఈఓగా బదిలీ అవ్వడంతో అనంతపురంలో ఉన్న తిప్పేనాయక్ ఇక్కడికి నియమితులయ్యారు. గతంలో 2024లో కూడా ఆయన ఇక్కడే పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను రెవెన్యూ అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
News February 8, 2026
విద్యుత్ సమస్యలా? సీఎండీకి ఫోన్ చేయండి!

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా SE రాజేశ్వరి తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 8688400499 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.


