News April 16, 2025
పార్వతీపురం: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

పార్వతీపురం ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యను అందించేందుకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రైమరీ లెవెల్ ఎస్జీటీలు 45, సెకండరీ లెవెల్ స్కూల్ అసిస్టెంట్లు115, ముందుగా విడుదలైన 49, ప్రస్తుతం మంజూరు చేసిన 66 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 1, 2025
KNR: లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవు: DMHO

లింగ నిర్ధారణ నిషేధ చట్టం (PCPNDT) అమలుపై DMHO డా.వెంకటరమణ అధ్యక్షతన అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం కరీంనగర్ DMHO కార్యాలయంలో నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 07 స్కానింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నేరమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేస్తే 9849902501 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News December 1, 2025
25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ షురూ

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 25,487 కానిస్టేబుల్(GD)ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను జనవరి 8, 9, 10 తేదీల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, అస్సాం రైఫిల్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వెబ్‌సైట్: <
News December 1, 2025
శ్రీపతిపల్లి: సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు

‘తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే’ అన్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు ప్రధాన రాజకీయ పార్టీల సర్పంచ్ అభ్యర్థులుగా ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. చిల్పూర్(M) శ్రీపతిపల్లికి చెందిన రంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, ఆయన సోదరుడు రంగు హరీష్ BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఒకే కుటుంబం నుంచి పోటీలో నిలవడంతో విజయం ఎవరిని వరిస్తుందోనని గ్రామంలో తీవ్ర చర్చ నడుస్తోంది.


