News January 17, 2025
పార్వతీపురం: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్-

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
Similar News
News November 9, 2025
మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

జనాబ్ మౌలానా అబుల్ కలాం అజాద్ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.
News November 9, 2025
అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి: VZM కలెక్టర్

ప్రజల సమస్యల పరిష్కారార్థం రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ వివరాలతో పాటు అర్జీలను సమర్పించాలని సూచించారు. అర్జీల స్థితి కోసం కాల్ సెంటర్ 1100 ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు.
News November 9, 2025
విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి విశాఖలోని మల్కాపురంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడే ఓ బార్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యం బారిన పడిన గణపతి శనివారం అర్ధరాత్రి బార్ వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


