News August 14, 2024
పార్వతీపురం: హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం రాత్రి పార్వతీపురం రెండవ అదనపు జిల్లా జడ్జి దామోదర్ రావు తీర్పునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2015లో పట్టణంలోని జరిగిన ఘర్షణ, హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1000 జరిమానా, ఏడుగురికి సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు రూ. 500 జరిమానా విధించినట్లు తెలిపారు.
Similar News
News September 18, 2024
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. విమానాశ్రయానికి అల్లూరి పేరును నామకరణం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 18, 2024
ఉమ్మడి జిల్లాలో రేపు రెండు అన్న కాంటీన్లు ప్రారంభం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్న కాంటీన్లను గురువారం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు క్యాంటీన్ల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జీజే కళాశాల పక్కన.. అలాగే బొబ్బిలిలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అన్న కాంటీన్లు ప్రారంభం కానున్నాయి.
News September 18, 2024
VZM: భర్త ఏడేళ్ల జైలు శిక్ష.. భార్యకు జరిమానా
డెంకాడ పోలీసు స్టేషనులో 2020లో నమోదైన హత్య కేసులో చింతలవలస గ్రామానికి చెందిన మోపాడ అప్పల నాయుడుకి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, అతడి భార్య శాంతికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం మహిళా కోర్టు తీర్పు వెల్లడించినట్లు భోగాపురం సీఐ జి.రామకృష్ణ తెలిపారు. ఇంటి స్థలం విషయమై 2020లో జరిగిన ఘర్షణలో అదే గ్రామానికి చెందిన పోలిపల్లి ఉమా అనే మహిళ మృతికి నిందితులు కారణమయ్యారు.