News April 2, 2025
పార్వతీపురం: ‘15.82 శాతం వృద్ధికి చర్యలు’

జిల్లాలో 15.82 శాతం వృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 2024-25 వార్షిక ప్రగతిలో భాగంగా గతేడాది జీడీపీలో 16.90 శాతం జిల్లా అభివృద్ధి సాధించగా, ఈ ఏడాది 16.12 శాతంగా మెరుగుపరిచేందుకు అంచనా వేస్తూ ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు.
Similar News
News December 5, 2025
HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.
News December 5, 2025
HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్‌లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇప్పుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.
News December 5, 2025
HYD: ఇదేం పునర్విభజన.. మేం ఉండలేం బాబోయ్!

మా ప్రాంతాలను గ్రేటర్‌లో కలిపితే మాకు అనుకూలంగా ఉండాలి కాని.. ఎక్కడో దూరంగా ఉన్న సర్కిళ్లలో కలిపితే ఎలా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలీనంలో భాగంగా బడంగ్‌పేట, తుర్కయాంజల్, ఆదిభట్ల ప్రాంతాలు చార్మినార్ జోన్ కలిశాయి. అయితే ఆయా ప్రాంతాల వారు మాత్రం.. మేము ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉంటామని చెబుతున్నారు. అలాగే పోచారం, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంత వాసులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.


