News August 21, 2024
పార్వతీపురం: 1,500 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బహుళ జాతి కంపెనీ (MNC)లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయి కుమార్ తెలిపారు. జెన్ ప్యాక్ట్ కంపెనీలో కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో 1500 ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారన్నారు. 2022,23,24 సంవత్సరాలలో డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులుగా తెలిపారు. ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 2, 2025
దేవాలయాల వద్ద ఏర్పాట్లుపై కలెక్టర్ సూచనలు

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, దేవాలయాలపై కన్నేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా ఉండేలా అధికారులు, దేవస్థాన నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు క్రమశిక్షణగా, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలన్నారు.
News November 2, 2025
విజయనగరం టీంకు ఓవరాల్ ఛాంపియన్ షిప్

ఏలూరులో జరిగిన 69వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-17 విభాగంలో విజయనగరం బాలికలు జట్టు ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెల్చుకుంది. ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారు జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు వెళ్తారు. వీరందరినీ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ వెంకటేశ్వరరావు అభినందించారు. జిల్లా పేరును జాతీయస్థాయిలో కూడా మార్మోగించాలన్నారు.
News November 2, 2025
VZM: బస్సు చక్రాల కింద నలిగిన బతుకు

గంట్యాడ మండలం కొత్తవెలగాడ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చౌడవాడ దాలినాయుడు(70) మృతి చెందాడు. మృతుడు తన స్వగ్రామం కొత్తవెలగాడ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించే సమయంలో బస్సు ముందు చక్రం కింద పడ్డాడు. తల నుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.


