News March 23, 2025
పార్వతీపురం: 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం

క్షయ నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ కోరారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ(టీబీ) నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శనివారం పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని వైద్య సిబ్బంది గుర్తించాలన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కఫం పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు.
Similar News
News September 18, 2025
ఆరోగ్యమే మహాభాగ్యం: ఆదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్‌లో నిర్వహించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. బుధవారం హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పేదలకు పథకం ద్వారా అందించే ఫుడ్ కిట్స్‌ను ఎంపీ పంపిణీ చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.
News September 18, 2025
ఈ సర్కార్ కార్మికులది.. సమస్యలు పరిష్కరిస్తా: CM రేవంత్

TG: హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని భాషల సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగేలా సహకరించాలని సూచించారు. సమ్మె చేస్తే ఇరువర్గాలకూ నష్టం జరుగుతుందన్నారు. సినీ కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వెల్లడించారు. ఈ సర్కార్ కార్మికులదని, సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
News September 18, 2025
ఆసిఫాబాద్: ‘పోషణ మాసం కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలి’

పోషణ మాసం రోజువారీ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం ASF జిల్లా కలెక్టరేట్ మందిరంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ నిర్వహణపై సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య,గిరిజన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 8వ రాష్ట్రీయ పోషణ మాసం అక్టోబర్ 16వ తేదీ వరకు రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.