News March 10, 2025

పార్వతీపురం: 372 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 372 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా సోమవారం 34 పరీక్ష కేంద్రాల్లో 7,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 7,508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 4,954 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,812 మంది విద్యార్థులు హాజరుయ్యారు. 2,926 ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,696 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2025

మాజీ సీఎం ఇంట్లో IT రైట్స్.. అధికారుల వాహనంపై రాళ్ల దాడి

image

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ CM భూపేశ్ బఘేల్ ఇంట్లో ED సోదాల సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. బఘేల్, ఆయన కొడుకు చైతన్య నివాసాల్లో రైడ్స్ అనంతరం అధికారుల వాహనంపై INC కార్యకర్తలు రాళ్లు రువ్వారు. అటు తనపై కేసును SC కొట్టేసినా రైడ్స్ చేయడంపై బఘేల్ మండిపడ్డారు. తన ఇంట్లో రూ.33 లక్షల నగదు మాత్రమే దొరికిందని, కానీ పెద్ద సంఖ్యలో క్యాష్ కౌంటింగ్ మెషీన్లు తీసుకొచ్చి ED సెన్‌సేషన్ చేస్తోందన్నారు.

News March 10, 2025

HYD: ప్రేమించిన అబ్బాయికి మరో పెళ్లి.. యువతి సూసైడ్

image

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వెన్నెలగడ్డలో విషాదం జరిగింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. MBA చదువుతున్న ప్రియాంక (26) రవికుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. తను వేరే పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 10, 2025

7:36 వరకూ ఇండియన్స్ మేల్కోరట.. మరి మీరు?

image

కొందరు భారతీయులు ఉదయం 6 గంటలకే మేల్కొంటే మరికొందరు 8 దాటినా బెడ్‌పైనే ఉంటుంటారు. అందరి యావరేజ్ ప్రకారం భారతీయులు 7:36 AMకు నిద్ర లేస్తారని ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ వెల్లడించింది. అందరి కంటే ముందుగా మేల్కొనేది సౌతాఫ్రికా ప్రజలే. వారు 6:24కే నిద్ర లేస్తారు. ఆ తర్వాత కొలంబియా 6:31, కోస్టారికా 6:38, ఇండోనేషియా 6:55, జపాన్ &మెక్సికో 7:09, ఆస్ట్రేలియా 7:13, USAలో 7:20AMకి లేచి పనులు స్టార్ట్ చేస్తారు.

error: Content is protected !!