News March 16, 2025
పార్వతీపురం: 67 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని DEO ఎన్.తిరుపతి నాయుడు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.
➤ జిల్లాలో మొత్తం ఎగ్జాం సెంటర్లు: 67
➤ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 10,455
➤ ఫ్లైయింగ్ స్క్వాడ్లు: 03
➤ సిట్టింగ్ స్క్వాడ్లు: 06
➤ కస్టోడియన్ సిటింగ్ స్క్వాడ్లు: 22
☞ అందరికీ Way2News తరఫున All The Best
Similar News
News March 17, 2025
విషాదం: అమెరికాలో ముగ్గురు తెలంగాణవాసుల మృతి

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6), ప్రగతి రెడ్డి అత్త సునీత(56)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కన్నుమూయడం టేకులపల్లిలో విషాదాన్ని నింపింది.
News March 17, 2025
మాకవరపాలెం: బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

మాకవరపాలెం మండలం చామంతిపురంలో ఒక యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్(17) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేశారు.
News March 17, 2025
కామారెడ్డి: భార్యని చంపిన భర్త

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్‌పేటకు చెందిన నవీన్‌కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.