News August 8, 2024
పార్వతీపురం: 9న ఆదివాసీ దినోత్సవం

ఆదివాసీ దినోత్సవంను ఆగష్టు 9న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అద్దంపట్టే విధంగా వేడుకలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News December 7, 2025
గడిచిన 20 రోజుల్లో 45 మందికి జైలు శిక్ష: VZM SP

రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని SP దామోదర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. గడిచిన 20 రోజుల్లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 45 మందికి జైలు శిక్ష పడిందని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 19,077కేసులు,మద్యం తాగి వాహనం నడిపిన వారిపై 5,510కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 17,246కేసులు నమోదు చేశామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగించాలన్నారు.
News December 7, 2025
VZM: కలెక్టర్ ఆఫీస్లో రేపు పీజీఆర్ఎస్

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవచ్చు అన్నారు.
News December 7, 2025
55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేసిన మంత్రి కొండపల్లి

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి కార్పొరేషన్ మండలి (COSIDICI) ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందిన 16 మంది పారిశ్రామికవేత్తలకు జాతీయ గౌరవ పురస్కారాలు లభించాయని మంత్రి తెలిపారు.


