News August 8, 2024
పార్వతీపురం: 9న ఆదివాసీ దినోత్సవం
ఆదివాసీ దినోత్సవంను ఆగష్టు 9న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అద్దంపట్టే విధంగా వేడుకలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News September 9, 2024
VZM: అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచన
బెంగుళూరు పర్యటనలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్ తో ఫోన్‌లో సోమవారం మాట్లాడారు. విజయనగరంలో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.భోగాపురం పోలీసులను అలెర్ట్ గా ఉంచాలని కోరారు.
News September 9, 2024
కొట్టుకుపోయిన పారాది తాత్కాలిక కాజ్ వే
బొబ్బిలి మండలం పారాది కాజ్ వే పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పారాది వద్ద వేగావతి నదిపై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పాతదైపోయింది. దానిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తాత్కాలిక కాజ్ వేను నిర్మించారు. వర్షాలకు కాజ్ వే ధ్వంసం కావడంతో భారీ వాహనాలను మళ్లించారు. విజయనగరం నుంచి బొబ్బిలి, పార్వతీపురం వెళ్లేందుకు ఈ మార్గమే దిక్కు.
News September 9, 2024
అత్యవసర సేవలకు కంట్రోల్ రూముల ఏర్పాటు: కలెక్టర్
భారీ వర్షాల నేపథ్యంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 08922-236947, విజయనగరం డివిజన్ కంట్రోల్ రూం: 08922-276888, బొబ్బిలి డివిజన్ కంట్రోల్ రూం: 9390440932, చీపురుపల్లి డివిజన్ కంట్రోల్ రూం: 7382286268 నంబర్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఏ అవసరం ఉన్నా కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.