News August 17, 2024

పాలకమండళ్ల ఏర్పాటుకు అధికారుల కసరత్తు

image

దేవాలయాల్లో పాలకమండళ్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది. యాదాద్రి BNG, SRPT, NLG జిల్లాలతో సహా జనగామలోని ఆలయ పాలక కమిటీల నియామకానికి దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ సులోచన ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని 34 దేవాలయాలకు ధర్మకర్తల మండళ్ల ఎంపిక కోసం ఆసక్తి గల వారు 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News September 8, 2024

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి

image

రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాకి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు మంత్రి పట్టణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

News September 7, 2024

సూర్యాపేట: క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి

image

ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామ శివారులో క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి చెందాడు. కూడలికి చెందిన బానోతు హీరా వాటర్ మోటర్ తీయబోయి నీళ్లలో చిక్కుకుని మరణించాడు. గతంలో అదే క్వారీలో మిడతనంపల్లికి చెందిన ముగ్గురి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. హీరా మృతితో విషాదం అలుముకుంది. 

News September 7, 2024

దేశంలోనే సెకండ్ ప్లేస్.. నల్గొండకు రూ.25లక్షలు

image

నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛ, వాయు సర్వేక్షన్‌లో 2024లో రెండో స్థానం సాధించడంతో రూ.25 లక్షల ప్రోత్సాహకం లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ సీఎం బజానా చేతుల మీదుగా ఈరోజు నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అందుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ… నల్గొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.