News February 12, 2025
పాలకుర్తిలో అత్యధికం.. తరిగొప్పులలో అత్యల్పం

జనగామ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 134 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం పాలకుర్తిలో 106, రఘునాథపల్లిలో 85, బచ్చన్నపేట 81, దేవరుప్పులలో 68, జనగామ 65, లింగాలఘన్పూర్ 64, జఫర్గఢ్ 63, చిల్పూరు 62, కొడకండ్ల 61, స్టేషన్ ఘనపూర్ 56, నర్మెట్ట 41, తరిగొప్పుల 31 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
Similar News
News November 12, 2025
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంట నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాల గురించి చర్చించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు పాల్గొన్నారు.
News November 12, 2025
ఈనెల 14న ఉమ్మడి జిల్లాస్థాయి విలువిద్య ఎంపిక పోటీలు

ఉమ్మడి కర్నూలు జిల్లా విలువిద్య ఎంపిక పోటీలను కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి కె.నాగరత్నమయ్య బుధవారం తెలిపారు. అండర్-21 బాలబాలికల విభాగంలో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు కృష్ణా(D) నూజివీడులో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వెల్లడించారు.
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.


