News March 19, 2025
పాలకుర్తి: అనారోగ్యం కారణంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ మారుతినగర్లో మంగళవారం ఆరే అజయ్(23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బసంతనగర్ ఎస్సై స్వామి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Similar News
News December 2, 2025
అంబేద్కర్ భవన్లో రేపు దివ్యాంగుల దినోత్సవం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం-2025 వేడుకలు రేపు నిర్వహించనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ భవన్లో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. అనంతరం గతంలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
News December 2, 2025
రెండు దశల్లో జనగణన: కేంద్రం

జనగణనను రెండు దశల్లో చేపట్టనున్నట్లు లోక్సభలో కేంద్రం స్పష్టతనిచ్చింది. 2026 APR-SEP మధ్య రాష్ట్ర ప్రభుత్వాల సౌలభ్యాన్ని బట్టి ఏవైనా 30 రోజుల్లో ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించింది. రెండో దశలో భాగంగా 2027 ఫిబ్రవరిలో జనగణన ఉంటుందని తెలిపింది. జనాభా లెక్కింపులో కులగణన చేపట్టనుంది. J&K, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాక్ వంటి మంచు ప్రాంతాల్లో 2026 SEPలో జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది.
News December 2, 2025
సీఎంకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వినతి

కొత్తగూడెం ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. గిరిజన పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని, కొమరారం, బోడు ప్రాంతాలను మండలాలుగా, చారిత్రక ఇల్లందును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సీతారామ ప్రాజెక్టు జలాలను నియోజకవర్గ రైతులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.


