News February 1, 2025

పాలకుర్తి: కారు -బైక్ ఢీకొని ముగ్గురికి గాయాలు

image

జనగామ జిల్లా పాలకుర్తి బస్టాండ్ వద్ద శనివారం కారు -బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
* బీజేపీకి 48, ఆప్‌నకు 22, కాంగ్రెస్‌కు 0 సీట్లు
* ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ
* AP: 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా: సీఎం చంద్రబాబు
* విడదల రజినీని దోషిగా నిలబెడతా: ప్రత్తిపాటి
* TG: కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: మంత్రి కొండా సురేఖ
* రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌ నాశనం: కేటీఆర్

News February 9, 2025

నిన్న ప్లేయర్.. నేడు కామెంటేటర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ SA T20లో మరో అవతారం ఎత్తారు. నిన్నటి వరకు ఆటగాడిగా అలరించిన కార్తీక్ ఇవాళ జరుగుతున్న ఫైనల్ మ్యాచులో కామెంటేటర్‌గా మారారు. తోటి కామెంటేటర్లతో కలిసి కామెంట్రీ బాక్స్‌లో ఆయన సందడి చేశారు. కాగా ఈ టోర్నీలో కార్తీక్ పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. 7 మ్యాచుల్లో 130 పరుగులు బాదారు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి మెంటార్‌గా వ్యవహరించనున్నారు.

News February 9, 2025

ఆటోకు మూడు చక్రాలే ఎందుకు ఉంటాయంటే?

image

ఆటో రిక్షాలు ఎన్ని అప్డేట్స్ పొందినా మూడు చక్రాలతోనే వస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోర్ వీల్ వాహనాల కన్నా 3 చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం ఈజీ. ఇరుకు ప్రదేశాల్లో దీనిని నడపటానికి అనువుగా ఉంటుంది. దీనిని తయారు చేసేందుకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. ఆటోను నడిపేవారు ఆయిల్‌పై ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇది ఇంకా మూడు చక్రాలతో వస్తోంది.

error: Content is protected !!