News March 4, 2025

పాలకుర్తి: చాకలి ఐలమ్మ వారసుడిని కలిసిన పృథ్వీరాజ్ 

image

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా రాష్ట్ర క్రాంతి సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 2, 2025

రేపటి నుంచి కాలేజీల బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే రేపట్నుంచి బంద్‌‌కు దిగుతామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అల్టిమేటం జారీ చేసింది. దసరాకు ముందే రూ.1,200CR విడుదల చేస్తామని చెప్పి రూ.300CR రిలీజ్ చేశారని తెలిపాయి. ఫీజు బకాయిలు చెల్లించేవరకు కాలేజీలు తెరవబోమని, ఈ నెల 6న లక్షన్నర మందితో HYDలో సభ నిర్వహిస్తామని చెప్పింది. దీంతో ప్రభుత్వం ఇవాళ ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.

News November 2, 2025

AVNLలో 98 పోస్టులు…అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్(AVNL) హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 98 కాంట్రాక్ట్ జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, NAC/NTC/STC ట్రేడ్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 2, 2025

మిడ్జిల్: ‘వేధింపుల కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి’

image

మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్య కేసులో జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌ను రిమాండ్‌కు పంపినట్టు సీఐ కమలాకర్ తెలిపారు. శ్రావణ్ లైంగిక వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన కూతురిలా మరో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా, నిందితుడు శ్రావణ్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులకు విన్నవించుకున్నారు.