News February 13, 2025

పాలకుర్తి: తండ్రికి తల కొరివి పెట్టిన ఐదేళ్ల చిన్నారి

image

జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన నాగన్న(30) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అభం శుభం తెలియని తన కూతురు రితీక(5) ‘నాన్న లే నాన్నా’ అంటూ బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో నాగన్న చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూసిన గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.

Similar News

News December 6, 2025

వెంకటపురం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలం వెంకటపురం పరిసర గ్రామాల్లో శనివారం ఏనుగుల గుంపు సంచారం చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అరటి తోటల్లోకి చొచ్చుకెళ్లిన ఏనుగులు పంట నష్టం కలిగించినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రాత్రి వేళల్లో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

News December 6, 2025

NTR: Way2News ఎఫెక్ట్.. త్వరలో డయాలసిస్ సెంటర్‌..!

image

ఏ.కొండూరులో 830 మందికి పైగా కిడ్నీ బాధితులు ఉండగా, 4 డయాలసిస్ బెడ్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై Way2News <<18484118>>కథనాలు<<>> ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ త్వరలో 12 బెడ్లతో కొత్త డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జనవరి 1న కిడ్నీ ప్రభావిత గ్రామాలకు <<18457085>>కృష్ణా జలాలు<<>> అందిస్తామన్నారు. బాధితులకు నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణ, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు.

News December 6, 2025

విశాఖ జైలంతా గంజాయి ఖైదీలే..!

image

విశాఖ కేంద్ర కారాగారం ఖైదీలతో నిండుతోంది. ఇక్కడ సామర్థ్యం 914 మంది కాగా, ప్రస్తుతం 1,724 మంది ఖైదీలున్నారు. వీరిలో గంజాయి కేసులో శిక్ష పడినవారు, విచారణ ఖైదీలు 1,100 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి రెట్టింపు ఖైదీలు ఉండటంతో పర్యవేక్షణ, వసతుల కల్పన అధికారులకు సవాలుగా మారింది. ఉమ్మడి విశాఖలోని గంజాయి కేసులను ఒకే న్యాయమూర్తి విచారిస్తుండటంతో ఖైదీల సంఖ్య పెరగడానికి కారణమని తెలుస్తోంది.