News April 11, 2024
పాలకుర్తి: తమ్ముడిని కాపాడిన అక్క

జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మధుప్రియ(10) తన తమ్ముడు మణివర్ధన్(6)ను కాపాడినట్లు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల వివరాలు.. ఇంట్లో వాటర్ హీటర్ ఆన్‌లో ఉండగా అది తెలియని మణివర్ధన్ దానిని పట్టుకోగా షాక్ తగిలింది. అలాగే హీటర్ వదలక ఏడుస్తుండగా స్నానం చేస్తున్న అక్క మధుప్రియ విని వెంటనే వెళ్లి సమయస్ఫూర్తితో హీటర్ ప్లగ్ తీసి కాపాడింది.
Similar News
News March 24, 2025
తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 24, 2025
KU: నేటి నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు

HNK కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News March 24, 2025
HNK: గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ చేసిన ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 4న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్‌లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా సూచించారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.