News February 18, 2025
పాలకుర్తి నియోజకవర్గంలో 6 నూతన చెక్ డ్యాములు మంజూరు

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినతికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పాలకుర్తి మండలంలో 3 గ్రామాలు, కొడకండ్ల మండలంలో 2 గ్రామాలు, తొర్రూరు మండలంలో 1 గ్రామానికి మొత్తం రూ.31 కోట్లతో 6 చెక్ డ్యాములను మంత్రి మంజూరు చేశారు. ఈ సందర్భంగా MLA రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News March 13, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 39.9°C నమోదు కాగా, కొత్తపల్లి-ధర్మారం, వెంకేపల్లి 39.8, జమ్మికుంట 39.7, గంగాధర 39.6, ఖాసీంపేట 39.5, ఇందుర్తి, ఈదులగట్టేపల్లి 39.2, వీణవంక 39.0, నుస్తులాపూర్ 38.9, బోర్నపల్లి, తాంగుల 38.7, అర్నకొండ, గుండి 38.5, గంగిపల్లి 38.3, పోచంపల్లి 38.2, మల్యాల 38.0, దుర్శేడ్ 37.9, చింతకుంట 37.7, KNR 37.6°Cగా నమోదైంది.
News March 13, 2025
ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: గంగాధర్

జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గంగాధర్ అధికారులను ఆదేశించారు. భువనగిరిలో ఆరోగ్యశాఖ అధ్వర్యంలో ముద్రించిన పోస్టర్ అవిష్కరించి మాట్లాడారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, నేరుగా సూర్యకిరణాలు తాకే స్థలాల్లో పనిచేసే వారు వడదెబ్బకు గురికాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
News March 13, 2025
₹2,100 చెల్లిస్తే ₹5,00,000.. నిజమిదే!

ప్రధానమంత్రి ముద్ర యోజనపై తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ₹2,100 చెల్లిస్తే ₹5,00,000 ఋణం మంజూరు చేస్తున్నట్లు ఓ నకిలీ ఆమోదిత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని పేర్కొంది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ముద్రా ఋణాలను సూక్ష్మ వ్యవస్థాపకులు/వ్యక్తులకు నేరుగా ఇవ్వదని తెలిపింది.