News February 23, 2025
పాలకుర్తి: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శనివారం అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంకా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈకార్యక్రమంలో వివిధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 22, 2025
MBNR: ఎండ తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

✓ దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలి. ✓ ప్రయాణాల్లో తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ✓ నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.✓సన్నటి, వదులుగా ఉండే లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ✓ ఎండలో బయటకు వెళ్తే గొడుగు, టోపి వంటివి ఉపయోగించాలి.✓ పగటి వేళలో కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలి.✓ ఆల్కహాల్, టీ, కాఫీ తాగకపోవడం మంచిదని వనపర్తిలోని డాక్టర్లు సూచిస్తున్నారు.
News March 22, 2025
వనపర్తి: ‘తిరుమలయ్య గుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దాలి’

వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టపై చిట్టడవిలో సంస్థానాధీశుల కాలంలో ప్రతిష్ఠించిన తిరుమలనాథస్వామి ఆలయం సుమారు 600 అడుగుల ఎత్తైన కొండపై ఉంది. ఔషధ గుణాలున్న ఎన్నో చెట్లు ఈ గుట్టపై ఉన్నాయి. ఏటా శ్రావణమాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, AP రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
News March 22, 2025
నిర్మల్: ‘ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ’

ఏప్రిల్ 1నుంచి ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు కలిగి ఉన్న వారంతా సన్నబియ్యం తీసుకునేందుకు అర్హులని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యాన్ని ఇవ్వవద్దని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలని సూచించారు.