News April 11, 2025
పాలకుర్తి: మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్

పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తాలో నలుగురు మైనర్లు ఒకే బైక్పై ప్రయాణిస్తుండగా ఎస్సై యాకూబ్ హుస్సేన్ వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Similar News
News December 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. రూ. 5.91 కోట్ల దుబారా!

NOVలో జరిగిన జూబ్లీ బైపోల్ నిర్వహణకు రూ.5.91 కోట్లు ఖర్చు చేసినట్లు RTI ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనిపై FGG అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త సిబ్బంది, వాహనాలు, పారామిలటరీ బలగాలు లేకుండా ప్రశాంతమైన జూబ్లీహిల్స్లో ఇంత భారీ ఖర్చు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా జరిగిందని, వెంటనే ఖర్చుపై ఆడిట్ నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని FGG ECకి విజ్ఞప్తి చేసింది.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలి: పెద్దపల్లి కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6న పిఓ, ఎపిఓలకు శిక్షణ ఇవ్వాలని, ఫారం 14 ఇచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది సమయానికి హాజరయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లాలో 4 సర్పంచ్, 210 వార్డులు ఏకగ్రీవం కాగా, 95 పంచాయతీలు, 670 వార్డులకు డిసెంబర్ 11న పోలింగ్ జరుగనుందని తెలిపారు.
News December 5, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<


