News February 26, 2025

పాలకుర్తి: శివరాత్రి ఏర్పాట్లపై డీసీపీ సూచనలు 

image

డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాలకుర్తి సోమేశ్వర ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి బుధవారం జరగబోయే మహాశివరాత్రికి సంబంధించిన బందోబస్తుపై పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నరసయ్య, సీఐ మహేందర్ రెడ్డి, ఆయా మండలాల ఎస్ఐలు తదితరులున్నారు.

Similar News

News October 26, 2025

అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడులపై దుమారం

image

సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం LICతో ₹33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న Washington Post కథనం దుమారం రేపుతోంది. ఇవి తప్పుడు ఆరోపణలని, తాము స్వతంత్రంగానే పెట్టుబడి పెట్టామని ఎల్ఐసీ స్పష్టం చేసింది. మరోవైపు 30 కోట్ల LIC వాటాదారుల కష్టార్జితాన్ని మోదీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.

News October 26, 2025

పెట్టుబడులపై ఆరోపణలు.. కంపెనీల్లో LIC వాటాలు ఇలా!

image

₹41 లక్షల కోట్ల ఆస్తులున్న LIC దేశంలోని టాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. వీటి విలువ 2014లో ₹1.56 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు 10 రెట్లు పెరిగి ₹15.6 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుతం పలు కంపెనీల్లో వాటాలు ఇలా.. TCS-5.02%(₹5.7 లక్షల కోట్లు) *రిలయన్స్‌-6.94%(₹1.33 లక్షల కోట్లు) *ITC-15.86%(₹82వేల Cr)*SBI-9.59%(79,361 కోట్లు) *HDFC బ్యాంకు-4.89%(₹64,725 Cr ) *అదానీ గ్రూపు-4% (₹60వేల Cr).

News October 26, 2025

ఎంజీఎం సూపరింటెండెంట్‌పై వేటు

image

ఎంజీఎం ఆసుపత్రిలో వరుస ఘటనలు,<<18099653>> ‘ఔరా ఇదేం వైద్యం.. ఎంజీఎంలో ఇద్దరికీ ఒకే సిలిండర్!’ <<>>అని Way2Newsలో శనివారం మధ్యాహ్నం ప్రచురితమైన కథనంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌పై వేటు వేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, ప్రతి వారం ఆసుపత్రిపై సమీక్షించి నివేదిక ఇవ్వాలని డీఎంఈ నరేంద్ర కుమార్‌కు సూచించారు.