News February 10, 2025

పాలకుర్తి: శ్రీ సోమేశ్వర జాతర వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 25 నుంచి మార్చి1 వరకు పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి జాతర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జాతరకు సంబంధించి వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆలయ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 19, 2026

ఎన్టీఆర్: APCRDA అడిషనల్ కమిషనర్‌గా కార్తీక్..నేపథ్యమిదే!

image

APCRDA అడిషనల్ కమిషనర్‌గా కొల్లాబత్తుల కార్తీక్‌ను నియమిస్తూ గత రాత్రి సిఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. విశాఖలో జన్మించిన కార్తీక్ 2020 IAS బ్యాచ్‌కు చెందినవారు కాగా ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. గతంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం నంద్యాల JCగా పనిచేస్తున్నారు. తాజాగా APCRDA అడిషనల్ కమిషనర్‌గా నియమితులయ్యారు.

News April 19, 2026

VZM: 21న ఫుట్బాల్, బాక్సింగ్ క్రీడా ఎంపికలు

image

ఈ నెల 21, 23, 24 తేదీల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 21న ఫుట్ బాల్ మహిళా, 23న ఫుట్ బాల్ పురుషులు, 24న బాక్సింగ్ బాలబాలికలు ఎంపిక పోటీలు విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉ.8 గంటలకు హాజరుకావాలన్నారు.

News April 19, 2026

అవసరమైతేనే బయటకు రండి: కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో ఎండలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని కలెక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. ముఖ్యంగా మే 31వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 45°C నుంచి 55°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.