News December 30, 2024
పాలకుర్తి: సోమేశ్వర ఆలయంలో ప్రత్యేకపూజలు
మార్గశిర సోమావతి అమావాస్య సందర్భంగా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వరస్వామివారికి మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నపూజ, విశేష పూల అలంకరణ కార్యక్రమాన్ని ఉపప్రధాన అర్చకులు డీవీఆర్ శర్మ, ముఖ్య అర్చకులు అనిల్ శర్మ, నాగరాజు శర్మ ఆధ్వర్యంలో సోమవారం కనుల పండువగా నిర్వహించారు. ఈఓ మోహన్ బాబు, పర్యవేక్షకుడు వెంకటయ్య, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 15, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునఃప్రారంభం
ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం పున: ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు యార్డు బంద్, సోమ, మంగళ, బుధవారం సంక్రాంతి సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉ. 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News January 15, 2025
గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఈరోజు ఉదయం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సూచించారు.
News January 15, 2025
ఐనవోలు జాతరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన MLA
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఐనవోలు పోలీస్ స్టేషన్లో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.