News February 19, 2025
పాలకొండకు జగన్ రాక రేపు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.
Similar News
News December 1, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

దిత్వా తుఫాను సందర్భంగా రైతులు తమ పంటలపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని మండలాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు దిత్వా తుఫాను ప్రభావం లేనప్పటికీ జిల్లా రైతులు తమ పంటల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News December 1, 2025
శ్రీకాకుళం జిల్లా SP గ్రీవెన్స్‌కు 61 అర్జీలు.!

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను SP ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. కాగా నేడు మొత్తం 61 అర్జీలు స్వీకరించామన్నారు.