News January 10, 2025
పాలకొండ: అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య

వీరఘట్టం మండలం సంత నర్సిపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానికుల కథనం మేరకు ఇంత రామకృష్ణ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలియడంతో పాలకొండ సీఐ చంద్రమౌళి, వీరఘట్టం ఎస్సై కళాధర్ శుక్రవారం ఉదయం పోలీస్ సిబ్బందితో వెళ్లి ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
Similar News
News October 31, 2025
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు: జేటీ రామారావు

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.
News October 31, 2025
SKLM: ‘పోటీ పరీక్షలకు మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ’

మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ అభ్యర్థులకు ఎస్.ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ED కె.కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజయనగరం శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఆసక్తి గల అభ్యర్థులు https://apcedmmwd.org వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 30, 2025
SKLM: పోలీస్ కుటుంబానికి రూ.కోటి అందజేత

శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న జగదీష్ కుటుంబానికి రూ.కోటిలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ ఏడాది జూన్ నెలలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా ఈ నష్టపరిహారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిందని SP పేర్కొన్నారు. ఖాతాలకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనుసంధానం చేసుకోవాలన్నారు.


