News March 25, 2024

పాలకొండ: కట్టె జనుము సాగుతో రైతులకు అపార నష్టం

image

కట్టె జనము సాగుతో రైతులకు అపారనష్టం వాటిలిందని పాలకొండ అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు సోమవారం తెలిపారు. సుమారు 50 శాతం మంది రైతులు అపరాల పంటలకు బదులుగా కట్టె జనుము సాగు చేశారని అన్నారు. గొంగళి పురుగు ఆశించడంతో కాయలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. జిల్లా పునర్విభజన అనంతరం రైతులకు సలహాలు సూచనలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల నుంచి దూరమయ్యాయని వాపోయారు.

Similar News

News December 6, 2025

శ్రీకాకుళం: టెట్ ఎగ్జామ్ సెంటర్‌లు ఇవే

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఈ నెల 10-21 వరకు జరగనుంది. జిల్లాలో సుమారు 12 వేల పైచిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
✦ఎగ్జామ్‌కు శ్రీకాకుళం జిల్లాలో కేటాయించిన కేంద్రాలు ఇవే:
➤ నరసన్నపేట-కోర్ టెక్నాలజీ
➤ఎచ్చెర్ల-శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల

News December 6, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లా మీదుగా విశాఖకు నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గరివిడి-సిగడాం-చీపురుపల్లి మధ్య భద్రతకు సంబంధించిన పనుల నేపథ్యంలో విశాఖ-పలాస-విశాఖ(67289/90) మెము రైలు, విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ(58531/32) ప్యాసింజర్ రైలు, విశాఖ-బ్రహ్మపూర్-విశాఖ(18525/26) ఎక్స్ప్రెస్ ట్రైన్లు డిసెంబర్ 6-8వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

News December 6, 2025

స్క్రబ్‌ టైఫస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రజలందరూ స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వైద్య శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐదు రోజులు పూర్తిగా జ్వరం తగ్గని వారు స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ‘చిగ్గర్ మైట్’ అనే కీటకం కుట్టడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వస్తుందన్నారు.