News February 17, 2025

పాలకొండ: నేడు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ఎన్నిక

image

పాలకొండ నగర పంచాయితీలో ఖాళీగా ఉన్న ఛైర్‌పర్సన్ పదవికి సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదివరకే పాలకొండ ఛైర్‌పర్సన్ పదవి కోసం రెండుసార్లు ఎన్నిక జరగ్గా వివిధ కారణాలు రీత్యా వాయిదా పడింది. దీంతో మూడోసారి ఈ ఎన్నిక నిర్వహించేందుకు నేడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక కొలిక్కి వస్తుందా లేదా అని నగర పంచాయతీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News December 14, 2025

MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

image

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.

News December 14, 2025

తిహార్ జైలును తరలించనున్న ఢిల్లీ సర్కార్

image

దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారంగా పేరొందిన ఢిల్లీలోని తిహార్ జైలును మరోచోటుకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీ CM రేఖా గుప్తా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జైలులో ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా సమస్యలు, మౌలిక వసతుల మెరుగుదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మంది సామర్థ్యం ఉన్న తిహార్‌లో ప్రస్తుతం 19,000 మందికిపైగా ఖైదీలు ఉన్నారు.

News December 14, 2025

యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదు

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భూదాన్ పోచంపల్లి మండలంలో 93.11 శాతం నమోదవగా అత్యల్పంగా రామన్నపేట మండలంలో 90.58 శాతం నమోదైంది. భువనగిరి మండలంలో 93.08 శాతం, బీబీనగర్ మండలంలో 91.38 శాతం, వలిగొండ మండలంలో 91.24 శాతం నమోదైంది. మొత్తం 2,02,716 ఓట్లకు 1,85,937 ఓట్లు పోల్ అయ్యాయి.