News January 13, 2025
పాలకొండ: మాజీ రాజ్యసభ సభ్యుడు రాజశేఖరం మృతి

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం ఇటీవల అనారోగ్యంతో శ్రీకాకుళంలోని జేమ్స్ హాస్పిటల్ చేరారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలు తర్వాత తుదిశ్వాస విడిచారు. గతంలో రాజశేఖరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, MLA, రాజ్యసభలో ఎంపీగా సేవలు అందించారు. 1970లో వీరఘట్టంలోని నీలానగరం సర్పంచ్‌గా గెలవడంతో రాజకీయం ప్రస్థానం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె.
Similar News
News February 10, 2025
శ్రీకాకుళంలో పెరుగుతున్న Water Melon విక్రయాలు

శ్రీకాకుళం జిల్లాలో వేసవి ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి నుండే వేసవిని తలపించే విధంగా భానుడు ప్రభావం చూపుతుండటంతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో వాటర్ మిలాన్, పండ్లు, జ్యూస్ షాపుల్లో విక్రయాలు పెరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ మిలాన్ విక్రయాలు జోరందుకున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి ప్రభావం ముందుగానే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.
News February 10, 2025
టెక్కలి: లారీ డ్రైవర్‌కు INCOME TAX నోటీసు

టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన చల్లా నాగేశ్వరరావుకు రూ.1,32,99,630 కోట్లు ఆదాయ పన్ను కట్టాలని నోటీసులు వచ్చినట్లు బాధితుడు వాపోయారు. తనకు ఏడాదికి సుమారు రూ.3.97కోట్లు ఆదాయం వస్తున్నట్లు పేర్కొంటూ నోటీసు వచ్చిందన్నారు. ఈ మేరకు ఆదివారం బాధితుడి న్యాయం చేయాలని టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు, తన సోదరుడికి ఆస్తి గొడవలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
News February 10, 2025
పలాస: దివ్యాంగురాలిపై అత్యాచారం.. కేసు నమోదు

శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిధిలోని ఓ గ్రామంలో ఇటీవల ఓ దివ్యాంగురాలు గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిపై ఆదివారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ గ్రామ పెద్దల సమక్షంలో శీలానికి వెల కట్టిన వ్యవహారం పలు పత్రికల్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ తెలిపారు.