News February 4, 2025
పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

కోరం లేక పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. కాగా.. కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఈ ఎన్నిక పూర్తిగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికపై ఎలక్షన్ కమీషన్‌కు నివేదిక పంపిస్తున్నట్లు పాలకొండ మున్సిపల్ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు వెల్లడించారు.
Similar News
News November 24, 2025
శబరిమల యాత్రకు మంథని డిపో నుంచి ప్రత్యేక బస్సు

శబరిమల భక్తుల కోసం మంథని డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు DM శ్రావణ్‌కుమార్ తెలిపారు. వెళ్లేటప్పుడు మంథని-హైదరాబాద్-శ్రీశైలం-మహానంది-కాణిపాకం-పంబ, తిరుగు ప్రయాణంలో మదురై-రామేశ్వరం-తిరుపతి మార్గంగా బస్సు నడుస్తుంది. చార్జీ ₹6900. బార్డర్ ట్యాక్స్, పార్కింగ్ ఫీజులు ప్రయాణికులే చెల్లించాలి. 35 సీట్లు బుక్ చేసిన గ్రూపులకు 5మందికి ఉచిత ప్రయాణం. బుకింగ్‌కు: 9959225923, 9948671514
News November 24, 2025
జిల్లా కలెక్టరేట్లో రేపు దిశ సమావేశం

జనగామ కలెక్టరేట్లో మంగళవారం దిశ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పేర్కొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, రేపు ఉదయం 11 గం.కు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొనాలని కోరారు.
News November 24, 2025
బీజేపీతో పొత్తు.. కొట్టిపారేసిన ఒవైసీ

‘బీజేపీతో మజ్లిస్ పొత్తు’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు వక్రీకరించి తప్పుదోవ పట్టించాయన్నారు. ‘ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. బీజేపీ భాగస్వామ్యం ఉన్న ఏ సర్కారుకూ మద్దతివ్వం. అయితే సీమాంచల్(బిహార్)అభివృద్ధికి నితీశ్ ప్రభుత్వం కృషి చేస్తే సహకరిస్తాం’ అని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రజల హక్కుల కోసమేనని తేల్చి చెప్పారు.


