News February 4, 2025
పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా

కోరం లేక పాలకొండ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. కాగా.. కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఈ ఎన్నిక పూర్తిగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికపై ఎలక్షన్ కమీషన్‌కు నివేదిక పంపిస్తున్నట్లు పాలకొండ మున్సిపల్ కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు వెల్లడించారు.
Similar News
News March 6, 2026
జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో రాణించిన పార్వతీపురం వాసులు

కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ లెవల్ ఆర్చరీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన జిల్లా గిరిజన విలుకాళ్లను జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆయన ఛాంబరులో అభినందించారు. ముగ్గురు గిరిజన విలుకాళ్లను నామినేట్ చేయగా, తమ అద్భుత ప్రదర్శనతో జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చారని ప్రసంశించారు. జాతీయ స్థాయి వేదికపై మన జిల్లా గిరిజన క్రీడాకారులు రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు.
News March 6, 2026
మిస్సైల్స్ అటాక్స్‌కు అవకాశం.. ప్రజలకు మెసేజ్‌లు

యుద్ధంతో గల్ఫ్ కంట్రీ దుబాయ్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మిస్సైళ్ల దాడులకు అవకాశం ఉందంటూ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇళ్లలోనే ఉండాలని, బయట ఉన్నవాళ్లు వెంటనే స్థానికంగా షెల్టర్లు తీసుకోవాలని ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. మరోవైపు ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ కూడా దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసింది.
News March 6, 2026
అసంఘటిత కార్మికులకు రూ.60 లక్షల బీమా కల్పించాలి: ఎమ్మెల్సీ

రాష్ట్రంలోని అసంఘటిత, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, SSA ఉద్యోగులకు రూ. 60 లక్షల ప్రమాద బీమా కల్పించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. ఈ మేరకు మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీరికి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి, ఆపద కాలంలో ఆదుకోవాలని కోరారు. కార్మికుల భద్రతపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన పేర్కొన్నారు.


