News April 12, 2025
పాలకొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

పాలకొండ మండలం విపిరాజుపేట జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కోటిపల్లికి చెందిన మోహన్రావు శనివారం ఉదయం పెళ్లి కార్డులను పంచడానికి బైక్పై వెళ్తుండగా దారిలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోహన్రావును స్థానికులు 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News December 7, 2025
శ్రీకాకుళంలో 104 ఉద్యోగులు నిరసన

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే 104 వాహనాల సిబ్బంది వేతన సమస్యలు, గ్రాట్యువిటీ, ఎర్న్డ్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిబ్బందిలో ఆందోళన నెలకొందని యూనియన్ నేతలు పేర్కొన్నారు.
News December 7, 2025
KNR: ఎమ్మెల్యేలూ.. నియోజకవర్గాలు విడిచి వెళ్లొద్దు..!

స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేవరకు MLAలు నియోజకవర్గాలు వదిలి బయటకు రావద్దని PCC ఆదేశించినట్లు తెలుస్తోంది. గెలిచిన సర్పంచి స్థానాలను బట్టే MLAల పనితీరుకు గ్రేడింగ్ ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీంతో MLAలు నియోజకవర్గంలో తిష్ట వేసి ప్రతి గ్రామం విజయావకాశాలపై సమీక్షిస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిపించి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టాలని ఉమ్మడి జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.
News December 7, 2025
కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తోట నవీన్ ఖరారు..?

కాకినాడ జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడిగా తోట నవీన్ పేరు ఖరారైనట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తోట నవీన్ మధ్య ఈ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఎంపీ సానా సతీశ్ బాబు సిఫార్సుతో అధిష్ఠానం తోట నవీన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


