News September 30, 2024
పాలకొండ: విద్యుత్ వైర్ తగిలి మహిళా కూలీ రైతు మృతి

పాలకొండ మండలం పెద్దమంగళాపురం గ్రామానికి చెందిన మహిళా కూలీ రైతు సోమవారం మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలో చెరుకు తోటలో విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్కు గురైన లంక పార్వతి(58) మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 1, 2025
పలాసకే తలమానికంగా నిలిచిన గుడి ఇది!

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వందలాది దేవతామూర్తుల విగ్రహాలతో <<18168511>>హరిముకుందా పండా అద్భుతంగా నిర్మించారు<<>>. తిరుమల శ్రీవారి విగ్రహంలా 9అడుగుల ఏకశిల విగ్రహాన్ని తిరుపతి నుంచే తెప్పించి ప్రతిష్ఠ చేశారు. పలాసకే ఈ గుడి తలమానికంగా నిలిచింది. దీంతో భక్తులు భారీగా ఆలయానికి వస్తుంటారు. హరిముకుంద ఒడియా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆలయంలో ప్రత్యేకతలు ఒడిశా సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి.
News November 1, 2025
రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట: హోం మంత్రి

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని హోం మంత్రి ఆదేశించారు. ఆలయానికి ప్రతి శనివారం 1500 నుంచి 2 వేల మంది వస్తుంటారని చెప్పారు. ఆలయంలో మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా రెయిలింగ్ ఊడిపడటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
News November 1, 2025
కాశీబుగ్గ ఘటనాస్థలికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ

కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి తొక్కిసలాటకు కారణాలపై స్థానికులను, భక్తులతో ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనలో మృతులు, క్షతగాత్రుల వివరాలు, ఆస్పత్రిలో చికిత్స అందుతున్న పరిస్థితిపై పర్యవేక్షించారు. వీరితో పాటు పలువురు జిల్లా అధికారులు ఉన్నారు.


