News February 2, 2025
పాలకొండ: హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి

హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా, ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ రిజల్ట్స్.. నిజామాబాద్ వాసుల ఫోకస్

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని నిజామాబాద్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.
News November 14, 2025
ఒక రౌండ్ అంటే ఏమిటి?

ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజున ‘రౌండ్’ అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. X అనే వ్యక్తి మొదటి రౌండ్లో ముందంజలో ఉన్నారు అని వింటాం. ఒక రౌండ్ అంటే 14 EVMల ఓట్ల లెక్కింపు. ప్రతి EVM ఒక బూత్‌ను సూచిస్తుంది. కాబట్టి ఒక రౌండ్ 14 బూత్‌ల ఓట్ల లెక్కింపు అని కూడా చెప్పొచ్చు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం EC ఒకేసారి 14 టేబుళ్లను ఉంచుతుంది. ఒక్కో టేబుల్‌పై ఒక EVM ఉంటుంది.
News November 14, 2025
GNT: బాధితులలో ఎక్కువ శాతం నగరవాసులే

ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహించబడుతుంది. మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి మందు ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిపిన అధ్యయనాలు ప్రకారం టైప్ 2 డయాబెటిస్ గ్రామీణ ప్రాంతంలో సుమారు 6.5% ఉంటే, నగరవాసులలో 21% కంటే ఎక్కువ ఉన్నట్లు అంచనా. బాధితులలో ఎక్కువ శాతం 25-55 ఏళ్ల వయసు వారే.


