News February 2, 2025
పాలకొండ: హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి

హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా, ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 9, 2025
హిందూపురం విద్యార్థుల ప్రతిభ

హిందూపురం పట్టణంలోని డీబీ కాలనీ అబాకస్ కాన్సెప్ట్ కేంద్ర విద్యార్థులు కిడ్స్ కాన్సెప్ట్ జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో 31 మంది పాల్గొనగా.. అందులో 25 మందికి జాతీయస్థాయి బహుమతులు వచ్చాయి. జాతీయస్థాయి కిడ్స్ కాన్సెప్ట్ పోటీల నిర్వాహకులు సచిన్ రావు నుంచి అబాకస్ కేంద్ర నిర్వాహకురాలు శృతి రేచల్ బెస్ట్ ఫ్రాంచెస్ అవార్డు అందుకున్నారు.
News February 9, 2025
థాంక్యూ మీట్‌కు హాజరుకాకపోవడంపై రష్మిక పోస్ట్

‘పుష్ప-2’ థాంక్యూ మీట్‌కు హాజరుకాని హీరోయిన్ రష్మిక ఆసక్తికర పోస్ట్ చేశారు. సుకుమార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కలిసి తమ శ్రమతో ఇలాంటి అద్భుతాన్ని అందించినందుకు థాంక్యూ చెప్పారు. శ్రీవల్లి హృదయంలో తమకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగం చేసినందుకు, గుర్తుండిపోయే రోల్ ఇచ్చినందుకు మరోసారి థాంక్యూ అని రాసుకొచ్చారు.
News February 9, 2025
రాంబిల్లి సముద్ర తీరంలో ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.